‘పుష్ప’ ట్రైలర్ వచ్చేది అప్పుడే..!

19

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్‌ సుకుమార్ కాంబోలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్’.ఈ సినిమాను డిసెంబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన ప్రతి పాటకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా దేవిశ్రీ బీట్స్ అదుర్స్ అనేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ ట్రైలర్‌ను సింపుల్‌గా వదిలేయకుండా, ఒక వేదిక ద్వారా వదలడమే మంచిదనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారట. డిసెంబర్ 2వ తేదీన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా టాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా అల్లు అర్జున్‌కు జంటగా రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే.