‘పుష్ప’ నుండి లేటెస్ట్‌ అప్‌డేట్‌..

47
Allu Arjun

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యలో ఈ సినిమా నుండి లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇచ్చారు చిత్రం బృందం.

కొన్ని కారణాల వల్ల హిందీ వర్షన్ విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. డబ్బింగ్ రైట్స్ కారణంగా 17న సినిమా విడుదల కాకపోవచ్చని చెప్పారు. అయితే ఈ వార్తలపై మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.. హిందీ వర్షన్ కూడా ఈ నెల 17నే విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. మరోవైపు ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 6న విడుదల చేయనున్నట్టు యూనిట్ ప్రకటించింది.