పుదుచ్చేరిలో 14 వరకు లాక్ డౌన్ పొడగింపు..

20
lock

పుదుచ్చేరిలో ఈ నెల 14 వరకు లాక్‌ డౌన్‌ని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. సోమవారం రాత్రితో విధించిన లాక్ డౌన్ గడువు ముగియగా మరో వారం పాటు పొడగించారు. అయితే పలు సవరణలు చేసింది పుదుచ్చేరి సర్కార్. నేటి నుంచి మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతించగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు.

కరోనా నేపథ్యంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయగా సోమవారం కేంద్ర పాలిత ప్రాంతంలో 482 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పుదుచ్చేరిలో ప్రస్తుతం 8,270 యాక్టివ్ కేసులుండగా మొత్తం 1,628 మంది వైరస్‌ బారినపడి మృతి చెందారు. లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు నమోదవగా.. 99,181 మంది కోలుకున్నారు.