సినీ కార్మికులందరికీ వ్యాక్సిన్‌: చిరు

164
vaccine
- Advertisement -

కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం సోమవారం ఉదయం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన చిరు.. కరోనా క్రైసిస్ చారిటి కింద ఈ రోజు సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికీ, ఫిలిం ఫెడరేషన్ వారందరికీ,అలాగే వారితో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ని కూడా చేర్చామన్నారు. అలాగే జర్నలిస్ట్ లకు కూడా వాక్సిన్ ఇస్తున్నాం. ఈ రోజు ఈ సీసీసీ తలపెట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ పునః ప్రారంభించాం అన్నారు.

సీసీసీ ఆధ్వర్యంలో గత ఏడాది సినిమా కార్మికులకు మూడు సార్లు నిత్యావసర సరుకులు అందచేశాం. సినీ కార్మికులందరిని ఒకే వేదికపైకి తెచ్చి సీసీసీ ఆధ్వర్యంలో వాక్సిన్ వేయించాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. 18 ఏళ్ళు నిండిన వారంతా వాక్సిన్ తీసుకోవాలి, వాక్సిన్ విషయంలో ఆలోచనలో ఉన్నవారు కూడా ఎలాంటి సంశయం లేకుండా వాక్సిన్ తీసుకోండన్నారు.

- Advertisement -