Priyanka:బీజేపీకి 180 సీట్లు కూడా రావు

23
- Advertisement -

బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్‌పైనే ఆధారపడిందని ఆరోపించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఈవీఎంల ట్యాంపరింగ్ చేయకుంటే బీజేపీకి 180 సీట్లు కూడా రావన్నారు.ఓ మీడియాతో మాట్లాడిన ప్రియాంక… దేశంలో ఒక‌వేళ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తే, అది కూడా ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేయ‌కుండా చేప‌డితే, అప్పుడు ఆ పార్టీకి 180 సీట్లు కూడా రావు అని గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌న‌న్నారు.

400 సీట్లు వ‌స్తాయ‌ని బీజేపీ ఎలా చెబుతోంద‌ని, వాళ్లేమైనా జ్యోతిష్యం చెప్పేవాళ్లా అని ప్రశ్నించిన ప్రియాంక… గ‌తంలో ఎప్పుడైనా ఇలా చేసి ఉంటారేమో అందుకే 400 సీట్లు వ‌స్తాయ‌ని వాళ్లు చెబుతున్నార‌న్నారు.ప్రియాంకా గాంధీ తెలిపారు. ట్యాంప‌రింగ్ చేయ‌కుంటే 180 క‌న్నా త‌క్కువ సీట్లే బీజేపీ గెలుస్తుంద‌ని తెలిపారు.

Also Read:నాలుగో విడత నోటిఫికేషన్..తెలుగు రాష్ట్రాల్లో అలర్ట్

- Advertisement -