మా తండాలో మా రాజ్యం..చేసిందే కేసీఆర్

13
- Advertisement -

మహాత్మా గాంధీ, అంబేద్కర్, సేవాలాల్ విగ్రహాలను ఒకే రోజు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ముద్విన్ గ్రామంలో నిరుపేద బిడ్డకు ఇంటిని అందజేసి, ఆ తర్వాత బోయిన్ గుట్టలో మహాత్మాగాంధీ, అంబేద్కర్, సేవాలాల్ మహారాజ్ విగ్రహాలను ఆవిష్కరించారు హరీశ్ రావు.

గాంధీ శాంతియుత మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించినట్లు, కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారు… అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్నారు. అందుకే కేసీఆర్ గారు 125 అడుగుల అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారు అన్నారు.

సేవాలాల్ మహరాజ్ ను ఎవ్వరూ పట్టించుకోలేదు.. ఎస్టీల గురించి ఆలోచించలేదు అన్నారు. కేసీఆర్ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఏకైక నాయకుడు కేసీఆర్… ఎస్టీ పిల్లలు చదువుకోవడానికి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కేసీఆర్, బంజారాహిల్స్ లో బంజారాభవన్ కట్టి ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసి మా తండాలో మా రాజ్యం నినాదాన్ని నిజం చేసిండు… కేసీఆర్ ఇంటింటికి నల్లా పెట్టి స్వచ్చమైన నీరు అందించిండు… అక్కా చెల్లి బిందె పట్టుకొని రోడ్ల మీదకు రాకుండా చేసిండు అన్నారు.

Also Read:మ్యాడ్ స్క్వేర్..ఎన్టీఆర్ వస్తున్నాడు!

రేవంత్ రెడ్డికి ఏమైంది. కరోనా లేదు, ఇబ్బంది లేదు, ఎందుకు ఇవ్వడం లేదు రైతు బంధు అన్నారు. చెప్పింది 49వేల కోట్లు, బడ్జెట్ లో 31వేల కోట్లు అన్నడు, ఇచ్చింది 14, 15వేలు కోట్లు కూడా లేదు… కేసీఆర్ జిడిపి పెంచితే, రేవంత్ గుండాయిజం పెంచుతున్నడు.. కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే, ఆయన కుటుంబ ఆదాయం పెంచుకుంటున్నడు, పేదల ఆదాయం మాత్రం పెరగటం లేదు అన్నారు.

- Advertisement -