వక్ఫ్ బిల్లు..ఎంపీలకు బీజేపీ విప్ జారీ

8
- Advertisement -

రేపు లోక్ సభలో బీజేపీ వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది బీజేపీ. సమాజ్ వాది పార్టీ కూడా పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. లోక్‌సభ ఎంపీలు అందరూ హాజరుకావాలని బీజేపీ, ఎస్పీ నేతలు పేర్కొన్నారు. అయితే ఈ బిల్లును ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ ప్రవేశపెట్టనున్న విప్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్లమెంటరీ వ్యాపార సలహా కమిటీ (BAC) సమావేశంలో వక్ఫ్ బిల్లు అంశంపై చర్చ జరిగింది. 12 గంటల చర్చకు విపక్షాలు డిమాండ్ చేయగా, ప్రభుత్వం తక్కువ సమయానికే ఒప్పింది. స్పీకర్ ఓం బిర్లా ఎనిమిది గంటల చర్చకు అనుమతించారు, అవసరమైతే సమయం పెంచే అవకాశం ఉందని తెలిపారు. దీంతో విపక్షాలు BAC సమావేశం నుండి బయటకు వెళ్లిపోయాయి.

వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 – 2024 ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీని లక్ష్యం భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణను సంస్కరించడం. 1995 వక్ఫ్ చట్టాన్ని ‘యునైటెడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ చట్టం, 1995’ (UWMEEDA 1995) అని పేరు మారుస్తూ ఈ బిల్లును తీసుకొస్తోంది బీజేపీ.

ఈ బిల్లులోని ముఖ్యమైన మార్పులు:
() కేంద్రకృత పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సరళతరం.
() కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులు ఏర్పాటు, ఇందులో ముస్లిం మహిళలు మరియు ఇతర మతస్తులకు ప్రాతినిధ్యం కల్పించబడుతుంది.
() జిల్లా కలెక్టర్‌కు వక్ఫ్ ఆస్తుల హోదాను నిర్ణయించే అధికారం ఇవ్వడం.
() ప్రభుత్వ నియామిత ఆడిటర్ల ద్వారా ఆడిటింగ్ తప్పనిసరి చేయడం.
() ఆస్తులకు వాస్తవమైన వక్ఫ్‌నామాలు ఉండాల్సిన అవసరం విధించడం.

Also Read:మహిళలకు రక్షణ ఏది?: ఎమ్మెల్సీ కవిత

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రస్తుత పార్లమెంటరీ బలం ఎన్డీయే కూటమికి 292 ఎంపీల మద్దతు ఉండగా ఇండయా కూటమి బలం 234గా ఉంది.

- Advertisement -