గచ్చిబౌలి భూములను వాపస్ తీసుకుంటాం: కేటీఆర్

10
- Advertisement -

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూములను బరాబర్ వాపస్ తీసుకుంటాం అని తేల్చిచెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి, వారి పోరాట స్ఫూర్తికి బీఆర్ఎస్ పార్టీ తరఫున, హైదరాబాద్ నగర ప్రజల తరఫున హృదయపూర్వక సెల్యూట్. హెచ్‌సీయూ విద్యార్థులది అసామాన్య పోరాటం చేస్తామన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీలో జరిగిన పోరాటాలకు ధీటుగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ వీరోచితంగా పోరాడుతున్నారు. పది రోజులుగా విద్యార్థులు పోరాడుతుంటే.. కనీసం వారితో చర్చలు జరపడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదు అన్నారు.

ఆందోళన చేస్తున్న విద్యార్థులను గుంటనక్కలు, పెయిడ్ బ్యాచ్ అనడం ముఖ్యమంత్రి, మంత్రుల అహంకారానికి నిదర్శనం..♦️ అక్కడ జంతువులే లేవు. అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ అని భట్టి విక్రమార్క తన కృత్రిమ మేధను బయట పెట్టుకున్నాడు అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి నియంతో ,బాసో కాదు. ఓ పెద్ద పాలేరు మాత్రమే .. మంత్రులైనా.. ఎమ్మెల్యేలైనా.. ఎమ్మెల్సీలైనా.. అందరూ పబ్లిక్ సర్వెంట్స్. ప్రజా సేవకులు మాత్రమే అని స్పష్టం చేశారు కేటీఆర్.కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్న ప్రజా పాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి అనువంతైనా లేదు.

రోజుకు 18 గంటలు పని చేస్తా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి కనీసం పది నిమిషాలు మనిషిలాగా ఆలోచించాలి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా రోజుకు 18 గంటలు పని చేయకుండా ఒక పది నిమిషాలు ఒక తండ్రి లాగా, ఒక తాత లాగా భవిష్యత్ తరాల మీద సోయితోని ఆలోచించాలి అని హితవు పలికారు. ప్రభుత్వ భూమి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు అర్ధరాత్రి దొంగలు లాగా అక్కడ పనులు ఎందుకు చేయిస్తున్నారు? … పది రోజులు సమయం ఇవ్వండని కోర్టుకు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల్లాగా ఎందుకు అక్కడ చెట్లు కొట్టేస్తూ వన్యప్రాణులను చంపేస్తుంది అన్నారు. కోర్టు సెలవులను చూసుకొని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుంది… శని, ఆదివారాలు ప్రజల మీదికి బుల్డోజర్లు ఎందుకు పోతున్నాయని హైకోర్టు సుప్రీంకోర్టులు చెప్పిన ప్రభుత్వానికి బుద్ధి రాదా.. ఇంగితం రాదా? చెప్పాలన్నారు.

మా ప్రభుత్వ హయాంలో హైదరాబాదును గ్రీన్ సిటీగా మార్చి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సాధించాము… కేసీఆర్ హయాంలో 270 కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించాం. హైదరాబాదులో 7.7% గ్రీన్ కవర్ పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది అన్నారు. పర్యావరణ పరిరక్షణలో, గ్రీన్ కవర్ ను పెంచడంలో తెలంగాణ దేశంలోని నెంబర్ వన్ గా నిలవడం మేము సాధించిన రికార్డ్.. పదేళ్లలో భారతదేశంలోని మెట్రో నగరాల్లో అత్యధికంగా పచ్చదనం పెరిగిన నగరం హైదరాబాద్ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ తెలిపిందన్నారు. 2021లో అత్యధికంగా గ్రీన్ కవర్ పెరిగిందని భారత ప్రభుత్వం పార్లమెంట్లో సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు కేటీఆర్.

- Advertisement -