నాలుగో విడత నోటిఫికేషన్..తెలుగు రాష్ట్రాల్లో అలర్ట్

11
- Advertisement -

రేపు నాలుగో విడత లోక్ సభ,ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపి 25 లో స్థానాలు పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు, బీహార్ 5 లోక్ సభ స్థానాలు, ఝార్ఖండ్ 4 లోక్ సభ స్థానాలు, మహారాష్ట్ర 13 లోక్ సభ స్థానాలు, ఒడిశా లోక్ సభ 4, తెలంగాణ లోక్ సభ 17స్థానాలు, ఉత్తరప్రదేశ్ 13లోక్ సభ స్థానాలు , వెస్ట్ బెంగాల్ లో 8లోక్ సభ స్థానాలు ,జమ్మూ కాశ్మీర్ లో లోక్ సభ స్థానానికి 1నోటిఫికేషన్ జారీ చేయనుంది ఈసిఐ.

మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 94 లోక్ సభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ కాగా ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఉండనుంది. ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా మే 13న పోలింగ్ జరగనుంది.జూన్ 4న ఫలితాలు రానున్నాయి.

Also Read:KTR:సివిల్స్ విజేతలకు అభినందనలు

- Advertisement -