క్యాస్టింగ్ కౌచ్.. ‘కార్తీకదీపం’ ఫేమ్ ప్రియమణి షాకింగ్ కామెంట్స్..

104
priyamani

సినీ ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో లైంగిక దోపిడీ అనేది ఎప్పుడూ చర్చల్లో నిలిచే అంశం. ‘క్యాస్టింగ్ కౌచ్‌’ పేరుతో మహిళలను లైంగికంగా వంచిస్తున్నారని ఇప్పటికే ఎందరో నటీమణులు ఓపెన్ కామెంట్స్ చేశారు. ‘మీటూ’ అలాగే సంచలన తార శ్రీ రెడ్డి చేసిన ‘క్యాస్టింగ్ కౌచ్‌’ ఉద్యమం తర్వాత చాలామంది నటీమణులు బాహాటంగా తమకు ఎదురైన చేదు అనుభవాలు బయటపెట్టడం చూస్తున్నాం. తాజాగా ఇదే అంశంపై ‘కార్తీకదీపం’ ఫేమ్ ప్రియమణి ఓపెన్ అవుతూ సంచలన విషయాలు చేసింది.

‘కార్తీకదీపం’ సీరియల్‌లో మోనిత వద్ద పని మనిషిగా కనిపించే ప్రియమణి తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ సంగతులతో పాటు ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్‌’ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కమిట్‌మెంట్స్ అనేవి ఇండస్ట్రీలో ఉన్నాయని, తాను కూడా అలాంటివి ఫేస్ చేశానని చెబుతూ ఆమె ఓపెన్ అయింది. తానే కాదు ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి అమ్మాయికి ఇలాంటి సందర్భం ఎక్కడో ఓ చోట ఎదురవుతూనే ఉంటుందని, అయితే అందుకు అంగీకారం తెలపడమా లేదా అనేది వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.

సినీ ఇండస్ట్రీనే కాదు అన్ని రంగాల్లో క్యాస్టింగ్ కౌచ్‌ అనేది ఉందని, ఒక అమ్మాయి బయట పని చేస్తుందంటే అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంటుందని ప్రియమణి చెప్పింది. అయితే లైంగిక దోపీడీ విషయంలో వార్నింగ్ లాంటివి ఇస్తే ఇక కెరీర్ అక్కడితో ముగిసినట్లే అంటూ ఆమె చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తన విషయంలో అలాంటి సందర్భం ఎదురైనపుడు అయితే ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా సింపుల్‌గా నవ్వుతూ బయటకొచ్చానని చెప్పుకొచ్చింది. అయితే కొందరు చిల్లర గాళ్ళు ఫోన్లు చేయడం వల్ల ఇంట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె చెప్పింది.