ఆ నటి పై కూడా లైంగిక వేధింపులు

8
- Advertisement -

నటి ప్రియమణి హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా సక్సెస్ అయ్యింది. అయితే, తన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటన గురించి తాజాగా ప్రియమణి పంచుకుంది. ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియమణి లైంగిక వేధింపుల గురించి తన చెత్త అనుభవాలను పంచుకుంది. ప్రియమణి మాట్లాడుతూ.. నేను హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన కొత్తలో ఓ దర్శకుడు తన బెడ్ రూమ్ లోకి వచ్చేశాడు అని, అరిచి గోల పెడితే, అతను వెంటనే పారిపోయాడు అని ప్రియమణి చెప్పుకొచ్చింది.

ప్రియమణి మరో సంఘటన గురించి కూడా మాట్లాడుతూ..’హీరోయిన్ గా చేస్తున్న రోజుల్లో నేను మా చిత్రబృందంతో కలిసి ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నాను. ఓ బిజినెస్ మెన్ నా పక్కనే వచ్చి కూర్చున్నాడు. మీతో కలిసి వెకేషన్ కి రావాలని ఉందని అతను స్టార్ట్ చేశాడు. మొదట నాకేం అర్ధం కాలేదు. అంతలో ఓ బ్లాంక్ చెక్ తీసి నాకు ఇచ్చాడు. దేనికి ఇస్తున్నారు అని అడిగితే.. నాతో పాటు మీరు రావడానికి అని బదులు ఇచ్చాడు. ఆ మాటతో నాకు కంపరం పుట్టుకొచ్చింది’ అని ప్రియమణి తెలిపింది.

ఇప్పటికే, సినీ లోకంలో క్యాస్టింగ్ కౌచ్ పై ఎందరో నటీమణులు తమకు జరిగిన చీకటి అకృత్యాలను వివరించారు. తాజాగా ప్రియమణి కూడా సంచలన విషయాలు బయటపెట్టింది. మరో సంఘటన గురించి కూడా చెబుతూ.. ఓ తమిళ దర్శకుడితో నేను ఓ సినిమా చేస్తున్న సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని ప్రియమణి చెప్పింది. ఆ దర్శకుడు ఆమెను బాగా వేధించే వారట. ఇలా మొత్తానికి ప్రియమణి చాలా విషయాలే చెప్పుకొచ్చింది.

Also Read:IPL 2024:ఓపెనర్‌గా ధోని.. పూనకాలే?

- Advertisement -