భామా కలాపం 2ని ఆదరించండి..

11
- Advertisement -

ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్ ‘భామా కలాపం 2’ నిర్మించారు. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ‘భామా కలాపం 2’ ఫిబ్రవరి 16న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ప్రియమణి మాట్లాడుతూ.. ‘భామా కలాపం 2లో అన్నీ డబుల్ ఉంటాయి. ఎక్కువ థ్రిల్స్, ట్విస్ట్‌లుంటాయి. అంతే కాకుండా ఈ సారి కాస్త డేంజరస్‌గా కూడా ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే సినిమాను చూడాలి. మా దర్శకుడు అభిమన్యుతో రెండో సినిమా చేస్తున్నాను. ఆయన తక్కువగా మాట్లాడతారు.. కానీ పని అద్భుతంగా చేస్తారు. మాటలు కాదు చేతలు మాట్లాడాలనే దానికి ఆయన ఉదాహరణ. శిల్ప, అనుపమ పాత్రలు ఇలానే కంటిన్యూ అవ్వాలి. రెండో పార్టులో కొన్ని పాత్రలను యాడ్ చేశాం. సీరత్ కపూర్ పాత్ర బాగుంటుంది. ప్రతీ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దీపక్ మా అందరినీ బాగా చూపించారు. హౌస్ వైఫ్ అంటే అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తుంది. మహిళ తలుచుకుంటే ఏమైనా సాధించగలదు. ఫిబ్రవరి 16న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రేక్షకులు మా చిత్రాన్ని చూసి ఆదరించాలి’ అని అన్నారు.

దర్శకుడు అభిమన్యు మాట్లాడుతూ.. ‘మా భామా కలాపం 2 టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాను కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను కాలేజీలో చదువుకుంటున్న టైం నుంచీ ప్రియమణి గారికి అభిమానిని. ఆమెతో వరుసగా రెండు సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. మా డీఓపీ దీపక్, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్, ఎడిటర్ విప్లవ్ ఇలా ప్రతీ ఒక్కరూ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ చిత్రంలో చాలా ట్విస్టులుంటాయి. మొదటి పార్ట్ చూసి రెండో పార్ట్ చూస్తే బాగుంటుంది. ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. సీరత్ పోషించిన పాత్రతోనే ఎక్కువగా ట్విస్టులు వస్తాయి.’ అని అన్నారు.

సీరత్ కపూర్ మాట్లాడుతూ.. ‘మొదటి సీజన్ చాలా పెద్ద హిట్ అయింది. ప్రియమణి, శరణ్య గారితో నటించడం ఆనందంగా ఉంది. జుబేదా పాత్రను నాకు ఇచ్చిన మా దర్శకుడు అభిమన్యుకు థాంక్స్. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాల’ని కోరారు.

నటి శరణ్య మాట్లాడుతూ.. ‘శిల్ప, అనుపమ పాత్రలను విడదీయకుండా మా పాత్రలను కంటిన్యూ చేస్తున్న అభిమన్యుకు థాంక్స్. ఈ ప్రాజెక్ట్ కోసం టీం అంతా కలిసి చాలా కష్టపడ్డాం. ఫిబ్రవరి 16న మా చిత్రం రాబోతోంది. ఆహాలో అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించండి’ అని అన్నారు.

Also Read:గోంగూర ఎక్కువగా తింటున్నారా?

- Advertisement -