ఎస్ఆర్‌ నగర్‌లో మల్టీపర్పస్ కమిటీ హాల్- మంత్రి వేముల

404
vemula prashanth reddy

త్వరలో ఎస్.ఆర్.నగర్‌లో మల్టీపర్పస్ కమిటీ హాల్ నిర్మాణం చేపట్టడానికి పనులు ప్రారంభిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఈ రోజు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎస్.ఆర్.నగర్ మల్టీపర్పస్ కమిటీ హాల్ నిర్మాణ పనులపై,ఎస్.ఆర్.నగర్‌లోని కమిటీ హాల్ వద్ద, సమీక్షా సమావేశం నిర్వహించారు.

minister prashanth reddy

ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ,స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్‌లు పాల్గొన్నారు. వెంటనే కమిటీ హాల్ నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వ జీవో ప్రకారం పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.

Minister Vemula Prashanth Reddy Review Meeting On SR Nagar Multipurpose Community Hall Construction Works..