ఆర్టీసీ జేఏసీ నుంచి తప్పుకున్న సూపర్‌వైజర్స్ అసోసియేషన్

383
rtc jac

టీఎస్ ఆర్టీసీ జేఏసీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది సూపర్ వైజర్స్ అసోసియేషన్. ఆర్టీసీ సమ్మె ముగిసిన కారణంగా టీఎస్ ఆర్టీసీ జేఏసీ నుండి సూపర్ వైజర్స్ అసోసియేషన్ వైదొలుగుతుందని ఓ. సుధ ప్రకటించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది సూపర్ వైజర్స్ అసోసియేషన్‌.

ఇదిఇలా ఉండగా ఆర్టీసీ కార్మికులతో సమావేశం అయిన సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ప్రతి ఏడాది బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయిస్తామని ఉద్యోగుల విరమణ వయస్సు 60 ఏండ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

ఒక్క బస్సు కూడా ప్రైవేటుకు ఇచ్చేదిలేదని..మహిళలకు రాత్రి డ్యూటీలు రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. వారికి ప్రసూతి సెలవుతోపాటు చైల్డ్‌కేర్ లీవ్ ఇస్తామని చెప్పారు. రెండేండ్ల పాటు ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు ఉండవని చెప్పారు.

Supervisors association out from TSRTC JAC..Supervisors association out from TSRTC JAC…Supervisors association out from TSRTC JAC

rtc jac