ఐపీఎల్ పాలకమండలిలో ఓజా!

68
ojha

భారత మాజీ స్పిన్నర్‌ ప్రగ్యాన్ ఓజాను ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌(ఐసీఏ) తమ ప్రతినిధిగా ఐపీఎల్‌ పాలక మండలికి నామినేట్‌ చేసింది. ఇవాళ బీసీసీఐ 89వ ఏజీఎం అహ్మదాబాద్‌లో జరగనుండగా బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశానికి ఒక రోజు ముందు ఈ ప్రతిపాదన చేయడం గమనార్హం.

బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఐసీఏ నుంచి ఒక సభ్యుడిని ప్రతిఏడాది ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు పంపాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఓజాను నామినేట్ చేశారు.

ఇక ఐపీఎల్‌ సన్ రైజర్స్ హైదరాబాద్‌కు సంబంధించి ఆసక్తికర వార్త వినబడుతోంది. ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించి కేన్ విలియమ్సన్‌ని ఆ జట్టు వదులుకోనుందని వార్తలు రాగా ఆ జట్టు యాజమాన్యాన్ని క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరారు.