ఐపీఎల్‌..ప్రారంభవేడుకలు వాయిదా

264
- Advertisement -

క్రికెట్ మహాసంగ్రామం ఐపీఎల్‌కు తెరలేసేందుకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలున్నాయి. పది సీజన్‌లు సక్సెస్‌ ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఐపీఎల్‌..11వ సీజన్ కోసం సర్వం సిద్దమైంది. ఇక ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఒక ఎత్తైతే…ఆరంభ వేడుకలు మరింత ఆకర్షణ తీసుకొస్తాయి. ప్రపంచదేశాల మోడల్స్‌,బాలీవుడ్ తారాగణం ఆరంభ వేడుకల్లో సందడి చేస్తారు. బాణాసంచా వెలుగుల్లో ఐపీఎల్ ఆరంభ వేడుకలను ఇప్పటివరకు జిగేల్‌ మనిపించేలా..చేసేవారు.

కానీ ఈసారి ఐపీఎల్ ఆరంభ వేడుకలకు బ్రేక్ పడింది. ఏటా ఐపీఎల్ ఆరంభానికి ఒకరోజు ముందు వేడుకలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7న టోర్నీ ప్రారంభం కానుండగా ఐపీఎల్ ఆరంభ వేడుకల్ని ఏప్రిల్ 6న నిర్వహించాలని బీసీసీఐ భావించింది. ఇదివరకే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది.

 CoA Cuts Budget for IPL Opening Ceremony

అయితే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్(సీవోఏ) బీసీసీఐ తలపెట్టిన ఐపీఎల్ ఆరంభ వేడుకలకు బ్రేక్ వేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ఇక ఆరంభ వేడుకల ప్రదేశం కూడా మారిపోయింది. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) స్టేడియంలో నిర్వహించాలని భావించిన బోర్డ్.. దాన్ని వాంఖడేకి మార్చింది.

బడ్జెట్‌ను రూ.30 కోట్లకు పరిమితం చేయాలని సీఓఏ నిర్ణయించడంతోనే ఈ మార్పులు చేశారని తెలుస్తోంది. ఆరంభ వేడుకల కోసం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తొలుత రూ.50 కోట్లు వెచ్చించడానికి ఆమోదం తెలిపింది. కాగా, సీఓఏ ఆదేశాలతో అందులో నుంచి రూ.20 కోట్లు తగ్గించనున్నారు.

ముంబై వేదికగా జరిగే తొలిమ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తలపడనంది. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై మళ్లీ ఐపీఎల్ సంగ్రామంలోకి రావడంతో ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

- Advertisement -