పుష్ప కోసం బన్నీ పాట్లు!

40
allu arjun

సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రం షూటింగ్ కొంత కేరళ అడవుల్లో జరిగింది. తాజాగా లాక్ డౌన్ అనంతరం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా రష్మిక కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు నిర్మాతలు. సినిమా కోసం బన్నీ తెగ కష్టపడుతున్నారట. తూర్పుగోదావరిలోని మారేడుమిల్లిలో షూటింగ్ జరుగుతుండగా అడవిలో బన్నీని చాలానే కష్టపెట్టాడట సుక్కు. అసలే అటవీ ప్రాంతంలో షూటింగ్.. పైగా ఎక్కువగా తీసింది యాక్షన్ సీన్స్. ప్రతి షాట్‌ను మూణ్నాలుగు యాంగిల్స్‌లో తీయడం.. ఒక పట్టాన షాట్‌ను ఓకే చేయకపోవడం.. ఇదంతా చూసి బన్నీని సుక్కు ఇంతగా కష్టపెట్టేస్తున్నాడేంటి అని యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారట.

అయితే ఇదంతా బన్నీ …సుకుమార్ పై ఉన్న అభిమానంతోనే చేశాడట. ఇప్పుడు ఈ వార్త టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.