తెలంగాణలో పెరిగిన విద్యుత్ డిమాండ్..

197
telangana power demand
- Advertisement -

రాష్ట్రంలో కొద్ది రోజులుగా విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయ్‌. సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చిన్న జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి‌. దీంతో రాష్ట్రమంతటా వ్యవసాయరంగానికి విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తోంది.

ఫలితంగా గడచిన రెండు రోజుల్లో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. మంగళవారం 10,600 మెగావాట్లు, బుధవారం 10,570 మెగావాట్ల గరిష్టస్థాయికి చేరింది. వాతావరణ అనుకూలతలు, పెరిగిన పంటల సాగు విస్తీర్ణం విద్యుత్‌ వినియోగాన్ని పెంచుతూ వస్తోంది.

గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఏకంగా 1751 మెగావాట్ల మేరకు విద్యుత్ వినియోగం పెరిగింది. ఎన్పీడీసీఎల్ పరిధిలో కూడా విద్యుత్ పీక్ డిమాండ్ 3 వేల 725 మెగావాట్లకు చేరింది. పెరిగిన విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -