రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం…

53
- Advertisement -

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం ఇవాళ జరిగింది. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అయింది. ఇవాళ ఉదయం 10.3 నిమిషాలకు 15062 మెగా వాట్ల విద్యుత్ అత్యధిక ఫీక్ డిమాండ్ నమోదు ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధిక వినియోగంగా రికార్డు అయిందని ట్రాన్స్‌కో, జేన్‌కో సీఎంగీ ప్రభాకర్ రావు తెలిపారు.

రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోందని…సాగు విస్తీర్ణం పెరగడం,రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతుందన్నారు. మొత్తం విద్యుత్ వినియోగం లో 37 శాతం వ్యవసాయ రంగంకేకాగా దేశంలో వ్యవసాయ రంగం కు అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ… మొత్తం విద్యుత్ వినియోగం లో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానం కాగా రెండో స్థానం లో తెలంగాణ నిలిచిందని వెల్లడించారు.

నిన్న 14 138 మెగా వాట్లు కాగా రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్ డిమాండ్ 15062 మెగా వాట్లు రికార్డ్ స్థాయిలో నమోదు ఇదే అన్నారు. గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా ఈసారి డిసెంబర్ నెలలోనే గత సంవత్సరం రికార్డ్ ను అధిగమించి ఈనెలలోనే 14750 మెగా వాట్ల ఫీక్ విద్యుత్ వినియోగం దాన్ని అధిగమించి 15062 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ నమోదు అయిందన్నారు.

ఈ సంవత్సరం వేసవి కాలంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఎంత డిమాండ్ వచ్చిన సరఫరా కు అంతరాయం లేకుండా సరఫరా చేస్తాం అన్నారు ప్రభాకర్ రావు. మార్చి నెలలో 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతుంది అని ముందే ఉహించాం అందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా కు ఏర్పాట్లు చేశాం అన్నారు. రాష్ట్ర రైతాంగంకు,అన్ని రకాల వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తాం అని తెలిపారు ప్రభాకర్ రావు.

- Advertisement -