భానుప్రకాశ్‌ను అభినందించిన మంత్రి కేటీఆర్…

102
ktr

లండన్‌లో జరిగిన మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన హైదరాబాద్‌కు చెందిన నీలకంఠ భాను ప్రకాశ్‌ను అభినందించారు మంత్రి కేటీఆర్. ప్రపంచంలోనే వేగంతమైన మానవ కాలిక్యులేటర్‌గా నిలిచిన బాను ఇవాళ మంత్రి కేటీఆర్‌ని కలిశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భానుకు చిన్న‌ప్ప‌ట్నుంచే మ్యాథ్స్ అంటే ఇష్టం. ఎస్ఐపీ వారి అబాకస్ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ చేసుకుని గణితంలో తన నైపుణ్యాలను పెంచుకునే దిశగా పయనించాడు. 2013లో అంతర్జాతీయ అబాకస్ చాంపియన్‌షిప్, 2011, 2012ల్లో జాతీయ అబాకస్ చాంపియన్‌షిప్‌లలో విజేతగా నిలిచారు.

.