కోతలు లేకుండా యురియా సరఫరా చేయాలి: నిరంజన్ రెడ్డి

161
niranjan reddy
- Advertisement -

తెలంగాణకు కేటాయించిన మేరకు మొత్తం యూరియా కోతలు లేకుండా కేంద్రం సరఫరా చేయాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.కేంద్రం ఇంకా ఇవ్వాల్సింది 4.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కాగా ఆగస్టు నెలాఖరు నాటికి రావాల్సిన బకాయి 2.54 లక్షల మెట్రిక్ టన్నులు ఉందన్నారు.

2020 – 21 వానాకాలానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం కేటాయించింది… 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 11.80 లక్షల మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులతో కలిపి మొత్తం 22.30 లక్షల మెట్రిక్ టన్నులు అన్నారు. రాష్ట్రానికి అవసరమైన ఎరువులను అంచనా వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రంతో స్వయంగా మాట్లాడారని తెలిపారు.

తాను, వ్యవసాయ శాఖ కార్యదర్శితో కలిసి రెండు సార్లు ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశాం, పలు మార్లు ఈ విషయంలో లేఖలు రాయడం జరిగిందన్నారు. ఇతర ఎరువుల విషయంలో ఎలాంటి సమస్య లేదు…యూరియా సరఫరాలో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఏప్రిల్ 1 నుండి ఆగస్టు 31 వరకు స్వయం కేంద్రం చేసిన కేటాయింపులు 8.69 లక్షల మెట్రిక్ టన్నులు ఆగస్టు 31 నాటికి వాస్తవంగా సరఫరా చేసింది 6.15 లక్షల మెట్రిక్ టన్నులు అన్నారు.

2.54 లక్షల మెట్రిక్ టన్నుల బకాయితో ఆగస్టు నెల ముగిసింది…. సెప్టెంబరు నెల కేటాయింపు 2.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అన్నారు. సెప్టెంబరు 30, 2020 ఈ వానాకాలం సీజన్ ముగిసే నాటికి రావాల్సిన బకాయి 2.54 లక్షల మెట్రిక్ టన్నులతో పాటు సెప్టెంబర్ నెల కేటాయింపు 2.10 లక్షల మెట్రిక్ టన్నులతో కలిపి కేంద్రం నుండి ఇంకా 4.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందన్నారు.

గత ఏడాది వానాకాలం సీజన్ లో తెలంగాణలో కోటీ 3 లక్షల ఎకరాలు సాగయిందని…. ఈ ఏడాది వానాకాలం సీజన్ లో ఇప్పటివరకు దాదాపు కోటీ 40 లక్షల ఎకరాలలో రైతులు పంటలు సాగు చేశారన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 36 శాతం అధికంగా పంటలు సాగుచేశారు.కేంద్రం కేటాయింపుల ప్రకారం ఏప్రిల్ నెలలో తెలంగాణకు రావాల్సింది 1.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసింది… 0.69 లక్షల మెట్రిక్ టన్నులు, బకాయి 0.37 లక్షల మెట్రిక్ టన్నులు అన్నారు.

మే నెల కేటాయింపు 1.63 లక్షల మెట్రిక్ టన్నులు, సరఫరా చేసింది.. 1.09 లక్షల మెట్రిక్ టన్నులు, బకాయి 0.54 లక్షల మెట్రిక్ టన్నులు అన్నారు. జూన్ కు సంబంధించి కేంద్రం కేటాయించిన యూరియా 1.38 లక్షల మెట్రిక్ టన్నులు, సరఫరా చేసింది 1.29 లక్షల మెట్రిక్ టన్నులు, బకాయి 0.09 లక్షల మెట్రిక్ టన్నులు అన్నారు. జులై నెలకు సంబంధించి తెలంగాణకు కేటాయించిన యూరియా 2.06 లక్షల మెట్రిక్ టన్నులు, సరఫరా చేసింది 1.27 లక్షల మెట్రిక్ టన్నులు, బకాయి 0.79 లక్షల మెట్రిక్ టన్నులు అన్నారు.

ఆగస్టు నెలకు కేటాయించింది 2.56 లక్షల మెట్రిక్ టన్నులు, సరఫరా చేసింది… 1.81 లక్షల మెట్రిక్ టన్నులు, బకాయి 0.75 లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం ఆగస్టు వరకు 8.69 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉండగా 6.15 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం సరఫరా చేసిందన్నారు. 2.54 లక్షల మెట్రిక్ టన్నుల బకాయి రావాల్సి ఉంది గత వానాకాలానికి, ఈ ఏడాది వానాకాలానికి పెరిగిన సాగును కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

- Advertisement -