బండిపై కేసు నమోదు..

17
mp

కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు నమోదైంది. కరోనా నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలగించడంపై బండి సంజయ్ సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదు అయ్యాయి. మధ్యాహ్నం తరువాత బండి సంజయ్‌ను పోలీసులు పీటీసీ సెంటర్ నుండి కోర్టుకు తీసుకెళ్లనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో కరీంనగర్‌ ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టగా దానిని భగ్నం చేశారు పోలీసులు. కరెంటు సరఫరాను నిలిపివేసి, కిటికీల నుంచి ఫైరింజన్‌తో నీళ్లు చల్లి, ఎంపీ కార్యాలయ ద్వారాన్ని బద్దలు కొట్టి సంజయ్‌ని అరెస్టు చేశారు. దీంతో ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.