కలిసి సినిమాను బతికిద్దాం: మోహన్ బాబు

87
mohan
- Advertisement -

గత కొంత కాలంగా ఏపీలో సినిమా టిక్కెట్ల రగడ మాములుగా జరగడం లేదు. దీనిపై స్పందించారు నటుడు మోహన్ బాబు. ఆ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. కలిసి సినిమాను బ్రతికిద్దాం అని పిలుపునిచ్చారు. మనకెందుకు మనకెందుకు అని మౌనంగా ఉండాలా..నా మౌనం చేతకాని తనం కాదు చేవలేని తనం కాదు. కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని కఠినంగా వారించారు. నీ మాటలు కఠినంగా ఉంటాయ్‌ నిక్కచ్చిగా ఉంటాయ్‌ కానీ నిజాలే ఉంటాయన్నారు. ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇది నీకు అవసరమా అన్నారు.

అంటే వాళ్లు చెప్పినట్టు బతకాలా..? సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు, నలుగురు నిర్మాతలు కాదు. కొన్ని వేల మంది ఆశలు.కొన్ని వేల కుటుంబాలు..కొన్ని వేల జీవితాలు..47 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నా మాట ఇది అన్నారు. చిన్న సినిమాలు ఆడాలి, పెద్ద సినిమాలు ఆడాలి. సినిమాలు ఆడాలంటే సరైనధరలుండాలి. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలి.

ఇండస్ర్టీకి దేవుళ్లయిన నిర్మాతలు ఇప్పుడెక్కడున్నారు. సనీ పరిశ్రమ ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. అందరి జీవితాలో ముడిపడి ఉన్న ఈ సనిమా ఇండస్ట్రీ గురించి, మనకున్న సమస్యల గురించి సీఎంలకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒకచోట సమావేశమై సమస్యలు ఏంటి..పరిష్కారం ఏంటి.. ఏది చేస్తే సీని పరిశ్రమ మనుగడ ఉంటుందని చర్చించుకోవాలని పిలుపునిచ్చారు.

- Advertisement -