తాడిపత్రి ఎపిసోడ్‌..జేసీపై మరో కేసు!

188
jc
- Advertisement -

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి….జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లడంతో రాజుకున్న పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతూనే ఉంది. తన ఇంట్లో పెద్దారెడ్డి కూర్చున్న కుర్చిని ప్రభాకర్ రెడ్డి కాల్చివేయగా తర్వాత మాటల యుద్దంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదుచేయగా జేసీ బ్రదర్స్ ఆమరణ నిరాహార దీక్షకు దిగేందుకు సిద్దం కాగా దానిని భగ్నం చేశారు పోలీసులు.

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌ రెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు.. మరోవైపు.. ఫామ్‌హౌస్‌లో ఉన్న జేసీ దివాకర్‌ రెడ్డిని కూడా బయటకు రానివ్వలేదు. ఈ క్రయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, పోలీసులపై దురుసుగా ప్రవర్తించారంటూ పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్లో జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 353, 506 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మరోవైపు తాడిపత్రి ఉద్రిక్తల మధ్య సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి సీఎం జగన్‌ను కలిసి పరిస్ధితులను వివరించారు.

- Advertisement -