ఏపీ వదిలి తెలంగాణకు వస్తా.. జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

37

ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈరోజు తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎల్పీలో పాత మిత్రులందరినీ కలిశానని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలే కాక, సమాజం కూడా బాగోలేదని అన్నారు. అయితే ఏపీ కంటే తెలంగాణ రాజకీయాలే బాగున్నాయని వ్యాఖ్యానించారు. ఇక తాను తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయానని… ఏపీని వదిలేసి తాను తెలంగాణకు వస్తానని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి తనకు పూర్తిగా తెలియదని చెప్పారు.