కార్యకర్తగానే పనిచేస్తా: జీవన్ రెడ్డి

36
jeevan reddy

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి పేరు ఖరారైందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి ఇంటి దగ్గర కోలాహలం నెలకొంది.పెద్ద ఎత్తున కార్యకర్తలు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకుని అభినందనలు తెలుపుతుండగా మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

పీసీసీ పదవి వచ్చినా సామాన్య కార్యకర్త గానే పనిచేస్తానని తెలిపారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఖరారు అయిందనే దానిపై ఎలాంటి సమాచారం లేదని.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నాకు సముచిత స్థానం కల్పించిందన్నారు.

భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి… పత్రికల్లో, టీవీల్లో వస్తుంది ఊహాజనితం మాత్రమేనని తెలిపారు.