పీఎం ఆవాస్ యోజన స్కాం….వెనుక ఉన్న ఆ బీజేపీ పెద్దలు ఎవరూ!

213
pradhan
- Advertisement -

ప్రధానమంత్రి ఆవాస్ యోజన్‌.. 2022 నాటికి “అందరికీ సొంత ఇల్లు” అందించే ఉద్దేశ్యంతో 25 జూన్ 2015 న ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించారు మోదీ. ఈ పథకం ద్వారా సంవత్సరానికి రూ .6 లక్షల వరకు సంపాదించే సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడివరకు అంతాబాగానే ఉన్నా ఇప్పుడు ఈ పథకం పక్కదారి పట్టింది. తాజాగా ఈ స్కీంలో వేల కోట్ల స్కాం బయటపడింది.

అనేక అక్రమ లావాదేవీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ బీజేపీ పెద్దల సాయంతో వేల కోట్ల కుంభకోణం చేసింది. రెండు లక్షల 60 వేల ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి ఇల్లు కట్టినట్లు, ఆ ఇంటికోసం రుణం తీసుకున్నట్లు మేనేజ్ చేసి కోట్ల రూపాయలను అప్పనంగా కొట్టేసింది. దాదాపు 14 వేల కోట్ల రుణాలిచ్చినట్లు చూపిన డీహెచ్‌ఎఫ్‌ఎల్.. వడ్డీపై సబ్సీడీ కోసం అంటూ రూ.1887 కోట్లు కేంద్రం నుండి తీసుకుంది. ఇ

అసలు ఇల్లే లేదు..లబ్దిదారుడే లేడు. అయినా ఎలాంటి ఎంక్వైరీ లేకుండా అప్పనంగా సదరు సంస్థకు వడ్డీమాఫీ కోసం వందల కోట్లు ఇవ్వడంపై అనేక సందేహాలు వెలువెత్తుతున్నాయి. దీంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎస్ బ్యాంకు కుంభకోణంలోనూ పరోక్ష పాత్రపోయించింది డీహెచ్‌ఎఫ్‌ఎల్. వేల కోట్ల రుపాయలు గల్లంతు చేయడంలో చరిత్ర ఉన్న సంస్థకు కేంద్రం ఎలా నిధులు విడుదల చేసిందనే దానిపై పెద్దల పాత్ర ఉన్నట్లు ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రధాని బహిరంగ ప్రకటన చేసి దీనివెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సామాన్యులకు రావాల్సిన గృహవసతి బోగస్ అకౌంట్లకు వెళ్తుంటే బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

- Advertisement -