హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిళ..

187
YS Sharmila

హీరో ప్రభాస్‌కు, తనకు సంబంధాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై హైదరాబాద్ పోలీసులకు వైసీపీ నాయకురాలు షర్మిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయనకు అందించానని, ఆయన సానుకూలంగా స్పందించి, విచారణ జరిపిస్తానని మాటిచ్చారని అన్నారు. షర్మిళతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ ఉన్నారు.

YS Sharmila

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. మహిళలను కించపరిచేలా పోస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల‌న్నారు. రాజకీయంగా తనను, తన అన్న వైఎస్ జగన్ ను, ఆయన కుటుంబాన్ని అణగ దొక్కాలని చూస్తున్న కొన్ని రాజకీయ శక్తులు సామాజిక మాధ్యమాల్లో అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్ షర్మిళ ఆరోపంచారు.

వైఎస్ షర్మిళ ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అదనపు డీసీపీ నేతృత్యంలో ఈ ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. కాగా, వైఎస్ షర్మిళపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వైసీపీ నేతలు ఖండించారు. ఇది కేవలం షర్మిళపై జరిగిన విషప్రచారం మాత్రమే కాదని, మొత్తం మహిళలపై జరిగిన దాడి అని అభివర్ణించారు.