అమీర్ పై ప్రశంసలు గుప్పించిన పవన్‌..

95
Pawan praises Aamir Khan's Dangal

రెజ్లర్‌ మహావీర్‌ సింగ్‌ ఫొగాట్‌ జీవితకథ ఆధారంగా నిర్మితమైన చిత్రం ‘దంగల్‌’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది. రికార్డు కలెక్షన్లతో పాటు ఎంతో మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు కూడా ఈ సినిమా ఎంతగానో నచ్చిందట. ఆ సినిమాను, అమీర్‌ను ప్రశంసిస్తూ పవన్‌ ట్వీట్‌ చేశాడు. అమిర్ ఖాన్ ఈ చిత్రంలో అద్భుత నటనని కనబరిచారని, ఆనటనతోనే ఆయన ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల మనసులు గెలుచుకున్నారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు .

ఇటీవలె దంగల్ సినిమా చూశానని…నా అభిప్రాయాన్ని పంచుకోకపోతే నా మనస్సాక్షి ఒప్పుకోదనిపించిందన్నారు. అమీర్ లాంటి నటుడు భారత్‌లో పుట్టడం మన దేశానికే గర్వకారమని తెలిపాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నితీష్ తివారీని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అభినందించారు . ప్రేక్షకులు లీనమయ్యేలా ఈచిత్రాన్ని తెరకెక్కించారని పవన్ కళ్యాణ్ అన్నారు. మిగతా నటీనటులను, సాంకేతిక బృందాని కి కూడా పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రధాన పాత్రలు పోషించిన ఫాతిమా, సన్యా మల్హోత్ర అద్భుతంగా నటించార’ని పవన్‌ ప్రశంసించాడు.

సామాజిక సమస్యలు, రాజకీయాల పైనే జనసేన చీఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్విట్టర్ లోస్పందిస్తారు. కానీ తొలిసారి పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో ఓ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆ చిత్ర బృందాన్నిప్రశంసల్లో ముంచెత్తారు. 

Pawan praises Aamir Khan's Dangal

Pawan praises Aamir Khan's Dangal

Pawan praises Aamir Khan's Dangal