పెరిగిన గ్యాస్,పెట్రోల్,డీజీల్ ధరలు

141
GDP goes up

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్ధికవ్యవస్థ కుదేలైంది. మోడీ నిర్ణయంతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోడీ చెప్పిన 50 రోజుల గడువు ముగిసిన సామాన్యుల కష్టాలు రోజురోజుకి రెట్టింపవుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నిత్యావసర వస్తువల ధరలు తగ్గుతాయి, ముఖ్యంగా గ్యాస్,పెట్రోల్,డీజీల్ ధరలు తగ్గుముఖం పట్టి సామాన్యునికి సైతం అందుబాటులోకి వస్తాయని మోడీ భక్తులు చేసిన భజన…గాలిలో దీపమని తేలిపోయింది.

ఇక నోట్ల రద్దుతో అవినీతి పరుగల గుండెల్లో రైళ్లు పరుగెడతాయన్న మోడీ వ్యాఖ్యలు నీటిమూటలు గానే మిగిలిపోయాయి. మెజారిటీ డబ్బు బ్యాంకుల్లో జమ కావటంతో కేంద్రానికి ఉహించని షాక్ తగిలింది. మరోవైపు మోడీ చెప్పిన సమయం కూడా ముగిసిపోయింది..అయినా పరిస్ధితిలో మార్పు రాలేదు. 50 రోజుల్లో అద్భుతాలు జరిగిపోతాయని డాంబికాలు పలికిన.. చివరికి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో రొటీన్‌ డైలాగులనే చదివి వినిపించారు. బడ్జెట్‌లో ప్రకటించటానికి కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ సిద్ధం చేసుకున్న హామీలను మోడీ ప్రకటించారని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

GDP goes up

దీనికి తోడు కొత్త ఏడాది కానుకగా తొలి రోజునే ప్రజలపై కేంద్రం ధరల భారం మోపింది. పెట్రోల్,డీజీల్‌ ధరలతో పాటు సబ్సిడీ వంట గ్యాస్‌ ధరనూ పెంచి సామాన్యుని నడ్డి విరిచింది. లీటర్‌ పెట్రోల్‌ రూ 1.29, డీజిల్‌ లీటర్‌కు రూ 0.97 పెంచుతు షాకిచ్చింది. దీంతో పాటు సబ్సిడీ సిలిండర్‌ ధరను కేంద్రం రూ 2 మేర పెంచింది. ఏడు నెలల్లో వంట గ్యాస్‌ ధరను పెంచడం ఇది ఎనిమి దవ సారి కావడం గమనార్హం. 2005 తర్వాత గరిష్టానికి పెట్రోల్,డీజీల్ ధరలు చేరుకున్నాయి. అసలే నోట్ల కష్టాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పెరుగుతున్న ధరలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఇక బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిలబడే సామాన్యుల కష్టాలు వర్ణణాతీతం. రోజురోజుకు బ్యాంకుల ముందు క్యూలైన్లు పెరిగిపోతునే ఉన్నాయి. క్యూ లైన్లలో నిలబడి చనిపోయే వారి సంఖ్య పెరుగుతునే ఉంది. కేంద్రం నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటం…దీనికి తోడు బ్యాంకర్లు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ములిగే నక్కమీద తాటిమట్ట పడిన చందంగా తయారైంది ప్రజల పరిస్ధితి. కొన్ని బ్యాంకుల ఏటీఎంలైతే తెరుచుకోవటమే లేదు. తెరచుకున్న గంటల వ్యవధిలోనే డబ్బు అయిపోతుండటంతో డబ్బులు ఉన్నా ఏం చేయలేని పరిస్ధితి నెలకొంది. ఏటీఎంల నుంచి విత్ డ్రా పరిమితి రూ.2వేల నుంచి రూ.4,500కు పెంచినా సమస్యలు తీరటం లేదు. ఏటీఎంల నుంచి పెద్దనోట్లే వస్తుండటంతో చిల్లర దొరక్క ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉన్నారు.

GDP goes up

బ్యాంకులు,ఏటీఎంల వద్ద పరిస్థితి సాధారణ స్థితికి ఎప్పుడు చేరుకుం టుందని సాధారణ పౌరుడు మోడీ సర్కార్‌ను ప్రశ్నిస్తున్నాడు. సోషల్ మీడియాలో నైతే మోడీ సర్కార్‌ని నిలదీస్తున్నారు నెటిజన్లు. మోడీపై సెటైర్లు వేస్తు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

SCHOOL GIRL TO HER FATHER :

“Daddy daddy, who is this modi ??
What has he done?
At my school everybody say modi modi..

Father- “what ? U dont know modi.. He is our Prime Minister !”

Daughter- “ok daddy, but what has he done ??

Father-“Have u not heard…
He gave a good speech at madison square, USA..
he gave a mind blowing speech in Siachen..
.
he gave a fantastic speech in Hyderabad..
.
he gave a heart touching speech on Independence day…”

Daughter-” Hmm.. what is he going to do in future papa?
.
.
Father- “Wait for Republic day my child..He will give one more fantastic speech”

Daughter – I m Speechless…