- Advertisement -
ఈ నెల 15 నుంచి దేశీ విమాన సర్వీసులను పునరుద్దరించనున్నారు. ఈ మేరకు పలు విమానయాన సంస్థలు బుకింగ్‌లను కూడా ప్రారంభించాయి. అయితే ఈ నెల 30 వరకు దేశీయ,విదేశీయ బుకింగ్‌లను తీసుకోబోమని ఎయిర్‌ఇండియా శుక్రవారం ప్రకటించింది.
లాక్ డౌన్‌తో నిలిచిపోయిన రైల్వే సేవలను సైతం ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. తొలుత ప్యాసింజర్ రైల్వే సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
దగ్గరి ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే సబర్బన్ రైళ్లతోపాటు లోకల్ రైళ్లను కూడా ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే మెట్రో, ఎంఎంటీఎస్ కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. రైల్వే సర్వీసులకు సంబంధించిన రిజర్వేషన్ బుకింగ్‌లను ఈ నెల 15 నుంచి ఐఆర్‌సీటీసీ స్వీకరించనున్నట్టు సమాచారం.
- Advertisement -