కరోనాపై గెలిచిన వృద్ధ జంట..!

326
Old aged couple

కరోనా వైరస్ ఎక్కువగా వృద్ధులు,చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కేరళలోని కొటాయంలో ఇద్దరు వృద్ధ దంపతులు కరోనా మహమ్మారిని ఓడించారు. కొటాయం మెడికల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న థామస్ (93), ఆయన భార్య (88) పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన టెస్ట్‌లో కరోనో నెగెటివ్ రావడంతో దంపతులిద్దరినీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. బీపీ, షుగర్‌తో పాటు వృద్ధాప్య సమస్యలు ఉన్నప్పటికీ వైరస్‌ నుంచి బయటపడ్డారని డాక్టర్లు తెలిపారు.

పత్తనంతిట్ట ప్రాంతానికి చెందిన ఈ వయోవృద్ధ జంట ఇటీవలే కరోనాతో ఆసుపత్రిపాలైంది. వారి తనయుడు కొన్నిరోజుల క్రితం ఇటలీ నుంచి కుటుంబసమేతంగా స్వస్థలానికి వచ్చాడు. కొడుకు ద్వారా ఆ వృద్ధ దంపతులకు కరోనా సోకింది. దాంతో వారిద్దరినీ కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు అందించిన చికిత్సతో ఇరువురు వైరస్ బారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.