కరోనా అప్‌డేట్స్…

144
corona virus

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11లక్షలకు చేరగా ప్రపంచ రణాల సంఖ్య 59 వేలు దాటింది.ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల 28వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,76,965కి చేరగా 7,391 మంది మృతిచెందారు.

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,567కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 72 మంది మృతి చెందారు.వైరస్‌తో 192 మంది బాధితులు కోలుకున్నారు.► మహారాష్ట్రలో 490 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 26 మంది మృతి చెందారు.

తెలంగాణలో 229 పాజిటివ్ కేసులు నమోదుకాగా 11 మంది మృతి చెందారు. తమిళనాడులో పాజిటివ్‌ కేసుల సంఖ్య 411 నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.ఢిల్లీలో 386 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. ఏపీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 164కి చేరగా విజయవాడలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది.