నా ఫేవరేట్ స్టార్ ధోని:వైష్ణవ్ తేజ్

43
panja vaishnav

తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించి నటుడు వైష్ణవ్ తేజ్. ఉప్పెనతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన వైష్ణవ్ తేజ్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. తన ఫేవరేట్ క్రికెటర్ ధోని అని చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల్లో హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఇష్టమని తెలిపాడు. హీరోయిన్స్ లో నజ్రియా నజీమ్ అంటే చాలా ఇష్టమన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు స్ఫూర్తి అని.. ఆయన నటించిన బద్రి, తమ్ముడు, ఖుషి సినిమాలంటే చాలా ఇష్టమని తెలిపారు.

దర్శకుడు క్రిష్‌తో సెకండ్ మూవీని పూర్తి చేసిన వైష్ణవ్ తేజ్.. త్వరలోనే గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.