తిరుమల శ్రీవారి సేవలో ఎన్వీ రమణ..

26
ttd

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సీజేఐ ఎన్వీ రమణ. తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన అలిపిరి మార్గం నుంచి తిరుమల చేరుకున్నారు. విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలకగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.

అంతకముందు తిరుచానూరు నుంచి పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణకి పాలకవర్గం, అధికారులు ఘన స్వాగతం పలికారు. జిల్లా న్యాయమూర్తులు, అనంతపురం డీఐజీ కాంతి రాణా టాటా, కలెక్టర్ హరినారాయణన్, సీవీఎస్వో గోపీనాథ్, తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు తదితరులు సీజేఐకి స్వాగతం పలికారు.