వైష్ణవ్ తేజ్‌..కొండపొలం @ అక్టోబర్ 8

133
konda polam

తొలి చిత్రం ‘ఉప్పెన‌’తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన మెగా సెన్సేష‌న్ వైష్ణ‌వ్ తేజ్‌.. ఇప్పుడు త‌న రెండో సినిమా విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. జెట్ స్పీడ్‌, ఎక్స‌లెంట్ క్వాలిటీ, డిఫ‌రెంట్ కంటెంట్‌తో సినిమాలు చేసే క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇందులో వైష్ణ‌వ్ తేజ్ జోడీగా న‌టించారు.

సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన నవలను ఆధారంగా చేసుకుని ఈ అడ్వెంచరస్ మూవీని రూపొందిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫ‌ర్‌. తాజాగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్,రిలీజ్ డేట్‌తో వచ్చేసింది చిత్రయూనిట్.

టైటిల్ కాస్త డిఫరెంట్‌గా కొండపొలం అని ఖరారు చేయగా వైష్ణవ్ తేజ్ లుక్‌ అదిరిపోయింది. ఇక సినిమాను దసరాకి అక్టోబర్‌ 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై బిబో శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

KONDA POLAM | PANJA VAISSHNAV TEJ | RAKUL PREET SINGH | CONCEPT TRAILER | WHITE TIGER PICTURES