గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి..

29
palla

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో టి ఆర్ యస్ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ వేయనున్న సందర్బంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని నల్గొండ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు సుఖేందర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో నల్గొండ జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ,ఎమ్మెల్సీ తెర చిన్నపరెడ్డి ,మాజీ ఎమ్మెల్యే విజయసింహ రెడ్డి , మదర్ డైరీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి ,తదితరులు పాల్గొని, పల్లా రాజేశ్వర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.