మళ్లీ కరోనా…మార్చి 7 వరకు స్కూల్స్‌ మూసివేత..!

56
corona

దేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఆయా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.

ఇక మహారాష్ట్రలోని అమరావతి,పూణేలో రాత్రిపూట కర్ఫ్యూ విధించగా తాజాగా నాగపూర్ లో మార్చి 7 వ తేదీ వరకు స్కూళ్ళు, కాలేజీలను మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇవాళ బృహత్ ముంబై అధికారులతో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే సమావేశం కాబోతున్నారు. ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులపై సమీక్షించనున్నారు.