బీజేపీ ఆఫీస్‌లో కరోనా కలకలం..

61
covid

దేశంలో కరోనా,ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. రోజుకు 2 లక్షలకు చేరువలో కేసులు నమోదవుతుండటంతో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ బాట పట్టాయి. తాజాగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో 50 మంది కరోనా బారిన పడ్డారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డులు గురువారం సమావేశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు.

కరోనా పరీక్షల్లో 50 మందికిపైగా కరోనా పాజిటివ్ తేలింది. పాజిటివ్‌ వచ్చిన నాయకులు తరుచూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశాలకు హాజరు కావడం వల్ల ఇంకా ఎంతమంది ఈ మహమ్మారి బారిన పడతారోనని ఆందోళన వ్యక్తం అవుతోంది.