దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం…

25
omicron

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తాజాగా వెయ్యి మార్క్ దాటి 1270కి చేరాయి ఒమిక్రాన్ కేసులు. మహారాష్ట్రలో 450, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్‌లో 97, రాజస్థాన్‌ 69, తెలంగాణలో 62, తమిళనాడులో 46, కర్ణాటకలో 34, ఆంధ్రప్రదేశ్‌లో 16 నమోదయ్యాయి.

తాజాగా దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. మహారాష్ట్రకు చెందిన ఒమిక్రాన్ బాధితుడు గుండెపోటుతో మృతిచెందాడు. పూణేలోని పింప్రీ చించువాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది.

మరణించిన వ్యక్తికి ట్రావెల్‌ హిస్టరీ ఉందని, నైజీరియా నుంచి వచ్చినట్లు మహారాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. అతడు గత 13 ఏళ్ల నుంచి డయాబెటిస్‌తో బాధపడుతున్నాడని పేర్కొంది.