నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన NRITRS..

219
nri trs
- Advertisement -

లండన్ : ఇటీవల అధిక వర్షాల వల్ల హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఇల్లు దెబ్బతిని నష్టపోయిన ప్రజలకు సహాయం చెయ్యాలనే సంకల్పంతో “వీ-కేర్ మేమున్నాము” అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. ఈ “వీ – కేర్” కిట్‌లో నిత్యావసర సరుకులతో పాటు వర్షాల వల్ల పెద్దలకు, చిన్న పిల్లలకు వచ్చే జ్వరం, జలుబు మరియు ఇతర నొప్పులకు ఉపయోగపడే మందులను డాక్టర్ సలహా మేరకు ఉచితంగా పంపిణి చేస్తున్నట్టు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.

మొదటి విడతగా సుమారు ౩౦౦ పైగా కిట్లను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేశామని, సుమారు 200 కిట్లని ఘట్కేసర్ మండలంలోని చౌదరిగూడ గ్రామంలో తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశామని అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. #wecare (మేమున్నాం) అని #NRITRSUK తీసుకున్న నిర్ణయాన్ని మర్రి రాజశేఖర్ రెడ్డి అభినందించారు. మేము సైతం అని కష్టలలో ఉన్నవారిని ఆదుకోవాలని ముందుకు వచ్చిన ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరిని మరియు కార్యవర్గ సభ్యులని ప్రసంశించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారై టి.ఆర్.యస్ నాయకులు మల్లేష్ పప్పుల మాట్లాడుతూ.. అటు పార్టీ కార్యక్రమాలతో పాటు ఇలా ఎన్నో సహాయక కార్యక్రమాలకు అన్ని సందర్భాల్లో స్పందించి తమ సమయంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఎన్నారై టి.ఆర్.యస్ యూకే ప్రతి కార్యవర్గ సభ్యున్ని అభించనందించి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్రి రాజశేఖర్ రెడ్డితో సహా స్థానిక టి.ఆర్.యస్ నాయకులు, ఎన్నారై టి.ఆర్.యస్ నాయకులు మల్లేష్ పప్పుల, ప్రవీణ్ పంతులు, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -