రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి-NRI TRS

53
Rahul Gandhi
- Advertisement -

లండన్ : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. అలాగే నేడు నిరుద్యోగుల కోసం ఒక మెగా నోటిఫికేషన్ ఇచ్చి వారి కోసం రాష్ట్రమంతటా ఎన్నో స్టడీ సెంటర్లని ఏర్పాటు చేసి నిరుద్యోగ కుటుంబాల్లో వెలుగు నింపాలని కెసిఆర్ ప్రత్నిస్తున్నారని, నేడు ఉస్మానియాలోని విద్యార్థులంతా కూడా ఎన్నో ఆశలతో ఉద్యోగ పోటీ పరీక్షలకు తయారైతుంటే, తెలంగాణ లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ వాతావరణాన్ని ఒక రణరంగంగా మార్చి , విద్యార్థుల్లో ఆందోళనను సృష్టిస్తు న్నారని అశోక్ తెలిపారు.

నాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరు అన్ని సంఘాలు వారి స్థాయిలో పోరాటాలు చేశాయని, రాష్ట్ర ఏర్పాటు తరువాత ప్రతి ఒక్కరు కెసిఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గర్వపడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కోసం ఉస్మానియా యూనివర్సిటీని ఎంచుకొని రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొడుతుందని, కాంగ్రెస్ నాయకులకు విద్యార్థులపై అంతటి ఆందోళనే ఉండి ఉంటే, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తున్నప్పుడు తీసుకొచ్చి మాట్లాడాల్సింది, నేడు ప్రాశాంతంగా ఉన్న యూనివర్సిటీని రణరంగంగా మార్చడం కాదని అశోక్ ప్రశ్నించారు.

దేశంలోని ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బడిపడుతుంటే ఒక జాతీయ ప్రతిపక్ష పార్టీగా వాటి మీద పోరాటం చెయ్యకుండా ఇక్కడ ఒక యూనివర్సిటీలో రాద్దాతం చేస్తున్నారంటే, వీరు వీళ్ళ పార్టీకి ప్రజల శ్రేయస్సు కంటే విద్వేషాలు రెచ్చగొట్టే ఆలోచనలే ఎక్కువున్నాయని, పని లేని పస లేని విషయాలపై దృష్టి ఉంది తప్పా నిజమైన సమస్యల మీద లేదని అశోక్ తెలిపారు. ముమ్మాటికీ రాహుల్ గాంధీ ఉస్మానియా విద్యార్థులకు, తెలంగాణ ప్రజలకు క్షామాపణ చెప్పి వారితో చర్చకు వెళ్లాలని అశోక్ డిమాండ్ చేశారు.

- Advertisement -