హాజీపూర్‌ క్రైమ్ ఎపిసోడ్..ఆ జంట మాయం వెనుక శ్రీనివాస్ రెడ్డి?

252
hajipur

యాదాద్రి జిల్లా హాజీపూర్‌లో శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడి, వారిని కిరాతకంగా అంతమొందించిన విషయం తెలిసిందే. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం తమ ప్రాంతంలో మామిడి తోటలు చాలా ఉన్నాయని.. తెలిసిన వారి తోటల్లో మిమ్మల్ని పనికి కుదర్చుతానని వరంగల్‌ నుంచి ఓ జంటను శ్రీనివాస్‌ తీసుకొచ్చినట్లు సమాచారం.

వారిని కొంతకాలంగా తన వద్ద లిఫ్ట్‌ మెకానిక్‌ పనిలో సహాయం చేయించుకున్నట్లు పోలీసులకు సమాచారం దొరికింది. అప్పటినుంచి వారు కనిపించడం లేదని గ్రామస్తులు తెలపడంతో దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారెవరు..ఇప్పుడెక్కడ ఉన్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు.

మరోవైపు కస్టడిలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి నుండి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది.
శ్రీనివాస్‌ ఫోన్‌లో అశ్లీల వెబ్‌సైట్ల సెర్చింగ్‌లే ఉన్నట్లు పరిశీలనలో గుర్తించిన పోలీసులు…సెల్‌ఫోన్‌లో అశ్లీల వెబ్‌సైట్‌తో కాలయాపన చేయడం శ్రీనివాస్ రెడ్డికి అలవాటుగా ఉన్నట్లు గుర్తించారు.