ఎలక్షన్స్‌ ఎఫెక్ట్‌..ఇకపై మెట్రో జర్నీ.. ఫ్రీ

323
delhi cm
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ సర్కార్‌కు గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా అధికార ఆప్‌ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కొన్నిచోట్ల ఆ పార్టీ అభ్యర్థులు మూడో స్ధానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలను ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్‌ త్వరలో మహిళలకు శుభవార్తనందించారు.

ఇకపై బస్సులు, మెట్రో రూళ్లలో మహిళలు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. మహిళల భద్రత,సౌకర్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ ఉచిత ప్రయాణం సాధ్యాసాధ్యాలపై డీఎంఆర్సీ సీనియర్‌ అధికారులతో భేటీ అయిన తర్వాత కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఢిల్లీ మెట్రో‌లో ప్రతి రోజూ దాదాపు 30 లక్షల మంది,బస్సుల్లో 42 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరిలో మహిళల వాటా 30శాతం ఉండగా వారందరికి ఫ్రీ జర్నీ తో లాభం చేకూరనుంది. త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -