‘అర్జున్ రెడ్డి vs ఫలక్‌నుమా దాస్’ సోషల్ మీడియాలో బిగ్ ఫైట్

446
vijay devarakonda Falknumadas
- Advertisement -

ఫలనుమాదాస్ హీరో కమ్ దర్శకుడు విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఈసినిమా రెండు రోజుల క్రితం విడుదలయిన సంగతి తెలిసిందే. ఈసనిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఆయన ఇన్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండపై కామెంట్లు చేశాడు. ఈసందర్భంగా సోషల్ మీడియా ద్వారా విశ్వక్ సేన్ పై మండిపడుతున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు. తాజాగా విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చేశాడు. తాను ఎవరి ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పారు. ఏ హీరోను తాను టార్గెట్ చేయలేదన్నారు.

ఎంతో కష్టపడి మేము ఫలక్‌నుమా సినిమా తీస్తే, హోర్డింగ్‌లు, బ్యానర్‌లు చించేసరికి చాలా బాధేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. నాపై ఎవరో పగబట్టి ఇదంతా చేస్తున్నారని అన్నారు. తన సినిమా గురించి రాసే రివ్యూరైటర్‌ని కానీ, మీడియా గురించి కూడా నేను ఒక్క కామెంట్ కూడా చేయలేదని తెలిపాడు. మూడు రోజుల నుంచి 180 పైరసీ లింక్‌‌లను డిలీట్ చేశామని.. మేము తొలగించినా.. మళ్లీ లింక్‌లు అప్‌లోడ్ చేస్తున్నారని అన్నాడు.

నేను నా సొంత పైసలు, నా ఫ్రెండ్స్ పైసలతో సినిమా తీశాను. అలాంటిది నా సినిమా పోస్టర్లు కూడా చింపేశారు. చాలా బాధేసింది. నేను ఎవ్వరికీ భయపడను. నేను అన్న మాటను పట్టుకుని నన్ను నెగిటివ్‌గా చూపించాలని చూస్తే మాత్రం నన్నెవ్వరూ ఏమీ చేయలేరని చెప్పారు. ఇక ఈవివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.

- Advertisement -