హజీపూర్ సైకో..మేడిచెట్టుకు పూజలు..ఎందుకో తెలిస్తే షాకే..!

207
srinivas reddy

హజీపూర్ సైకో,మానవమృగం శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్‌లో మరో ఉదంతం వెలుగుచూసింది. ఇప్పటికే పోలీస్ కస్టడీలో నిజాలను వెల్లడించిన శ్రీనివాస్‌ రెడ్డికి త్వరలో శిక్ష ఖరారు కానుండగా తాను చేసిన తప్పులకు పరిహారంగా ఊరి చివరలోని మేడిచెట్టుకు నిత్యం పూజలు నిర్వహించేవాడట. గ్రామంలో ఎవరితోనూ పెద్దగా స్నేహంగా ఉండని శ్రీనివాస్‌ రెడ్డి ఎప్పుడు ఒంటరిగా సంచరించేవాడు. అయితే గ్రామ సమీపంలోని శమాసుల బావి వద్ద మేడిచెట్టుకు ప్రతిరోజు పూజలు చేసేవాడట.

సాధారణంగా ఏవైనా దోషాలు ఉంటే నివారణ కోసం చెట్లకు కొంతమంది పూజలు చేస్తే మరికొంత మంది అంతా శుభం జరగాలని పూజలు చేస్తారు. అదే కోణంలో చిన్నారులను హతమార్చిన శ్రీనివాస్‌ రెడ్డి దోష నివారణ కోసం మేడిచెట్టుకు పూజలు చేసేవాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

శ్రీనివాస్ రెడ్డి మేడిచెట్టుతో పాటు రాగి,వేప చెట్లకు పూజలు చేయడాన్ని చూసినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే సైకో దారుణాలు వెలుగు చూసిన తర్వాత మేడిచెట్టుకు పూజ చేయడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

ఇక ఈ మేడిచెట్టుపై మూడు పేర్లు చెక్కి ఉండగా అందులో ఓ పేరు మనీషాది. మరో రెండు పేర్లు శ్రావణి,కల్పనవిగా భావిస్తున్నారు. రోజూ ఈ చెట్టు వద్దకు వచ్చి నీళ్లు పోసి పసుపు, కుంకుమ బొట్లను పెట్టి పూజలు చేసేవాడట.

మరోవైపు శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలని కోరుతూ బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తుండగా తమ కొడుకుకు ఉరి శిక్ష తక్కువేనని మండిపడుతున్నారు తల్లిదండ్రులు. తమ కొడుకు ఇంత దారుణం చేస్తాడని కలలో కూడా ఉహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.