మా కొడుకును ఉరితీయండి: హాజీపూర్ సైకో తల్లిదండ్రులు

204
srinivas reddy

ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన హాజీపూర్ కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డిని చంపేయాలని అతడి తల్లిదండ్రులు చెప్పారు. తమ కోడుకు చేసింది చిన్న నేరం కాదని..ఉరిశిక్ష కంటే పెద్ద శిక్ష ఏదైనా వేయాలన్నారు. శ్రీనివాస్ రెడ్డి హత్యోదంతాలు వెలుగులోకి రాగానే స్వగ్రామం హాజీపూర్ వదిలిపెట్టి పారిపోయిన అతడి తల్లిదండ్రులు ఓ ఛానల్‌తో తమ బాధను పంచుకున్నారు.

ముగ్గురు అమ్మాయిలను దారుణంగా హత్య చేయడం ఘోరమైన పాపమన్నారు. తమ కొడుకు వల్ల తలెత్తుకోలేని పరిస్థితి దాపురించిందని.. ప్రాణ భయంతో ఎక్కడ తింటున్నామో, ఎక్కడ ఉంటున్నామో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తన కొడుకు కారణంగా తన కుటుంబం ఆగమైందని.. దుర్భర పరిస్థితి తలెత్తిందని శ్రీనివాస్ రెడ్డి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. వాడిని చంపేస్తేనే ఆ అమ్మాయిలకు న్యాయం జరుగుతుంది అంటూ కంటతడి పెట్టారు. తన కొడుకు ప్రవర్తనపై ఏనాడూ అనుమానం రాలేదని.. విషయం ముందుగా తెలిస్తే పరిస్థితి మరోలా ఉండేదేమోనని చెప్పారు.