ఆ పది పార్టీల దారెటు?

43
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పొత్తులకు సంబందించిన చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. పొత్తుల విషయంలో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా దూకుడుగానే వ్యవహరిస్తున్నాయి. విపక్షాలతో కలిసి కాంగ్రెస్ INDIA కూటమిని ఏర్పరచగా.. అటు బీజేపీ తమ మిత్రపక్షాలతో ఎన్డీయే కూటమిని మరింత బలపరిచే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్డీయే కూటమిలో 38 పార్టీలు ఉండగా..INDIA కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. అయితే అటు ఎన్డీయే కూటమికి గాని, ఇటు ఇండియా కూటమికి గాని మద్దతు తెలపని పార్టీలు కూడా ఉన్నాయి. వాటిలో ఏపీ నుంచి టీడీపీ, వైసీపీ, తెలంగాణ నుంచి బి‌ఆర్‌ఎస్ పార్టీలు ఉండగా.. నార్త్ లో బిజూ జనతా దళ్, బహుజన్ సమాజ్ పార్టీ, ఏంఐఏం, శిరోమణి అకాలీదళ్, జేడీయూ, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ, అల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్.. వంటి పార్టీలు తటస్థంగా ఉన్నాయి.

Also Read:పవన్ క్యారెక్టరే జగన్ టార్గెట్ ?

మరి ఈ పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఎటువైపు వెళ్తాయనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. టీడీపీ ఎన్డీయేలో చేరేందుకు సిద్దంగానే ఉండగా వైసీపీ మాత్రం అటు ఎన్డీయే వైపు గాని ఇటు విపక్షకూటమి వైపు గాని.. లేకుండా తటష్టంగా వ్యవహరిస్తోంది. అటు తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ కూడా ఇదే వైఖరి ప్రదర్శిస్తోంది. అయితే ఇలా తటస్థంగా ఉన్న పార్టీల పైన కూటముల ప్రభావం పడే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నారు. ఎందుకంటే పొత్తులో ఉన్నకారణంగా సీట్ల విషయంలోనూ, ప్రచార విషయంలోనూ ఎంతో కొంత సానుకూల ప్రభావం ఉంటుంది. అంతే కాకుండా కూటమి అనేది ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించే అవకాశం లేకపోలేదు. మరి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉండడంతో ప్రస్తుతం తటస్థంగా వ్యవహరిస్తున్న చాలా పార్టీలు ఏదో ఒక కూటమి వైపు అడుగులు వేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నా మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:‘బేబీ’నా.. ఆమ్మో మాకొద్దూ!

- Advertisement -