బాక్సాఫీస్ వార్..లియో వర్సెస్ భగవంత్ కేసరి!

36
- Advertisement -

టాలీవుడ్‌లో మరో ఆసక్తికర పోరు జరగనుంది. అయితే ఈసారి నందమూరి బాలకృష్ణతో తలపడనున్నారు తమిళ నటుడు విజయ్. ఆయన నటించిన లియో అక్టోబర్ 19న విడుదల కానుండగా తాజాగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి రిలీజ్ డేట్ ఖరారైంది. ఈరోజు విడుదల తేదీని ప్రకటించి ఫ్యాన్స్‌కు కొత్త ఊపునిచ్చారు బాలయ్య.

బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీలీల కీ రోల్ పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

Also Read:గ్రీన్‌ ఛాలెంజ్‌లో నిర్మల్ కలెక్టర్..

ఇక విజయ్ లియోను తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. సుమారు రూ.18.5 కోట్లకు ‘లియో’ తెలుగు హక్కులను సితార కొనుగోలు చేసింది. దీంతో ఈ సారి దసరా ఫైట్ బాలయ్య, విజయ్ మధ్య ఉండబోతోంది. అక్టోబర్ 20న రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల కానుంది.

Also Read:‘బేబీ’నా.. ఆమ్మో మాకొద్దూ!

- Advertisement -