కంచుకోటలో పోటీపై కాంగ్రెస్ మౌనమేలా!

7
- Advertisement -

ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్నాయి. అందుకే ఆ ఫ్యామిలీ నుండి సేఫ్ జోన్‌లుగా ఆ రెండు స్థానాలను ఎంచుకుంటారు. అయితే ఈ సారి ఆ రెండు స్థానాల్లో పోటీపై కాంగ్రెస్ ఎందుకు ఇంత దోబుచులాడుతోంది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ కేడర్‌ని వేధిస్తున్న ప్రశ్న. యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు కంచుకోట.

గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కేరళాలోని వాయనాడ్‌కు మకాం మార్చారు రాహుల్. ఇక రాయ్‌బరేలి నుండి ఇప్పటివరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించగా ఇప్పుడు ఏం తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్. ఎందుకంటే వయోబారం కారణంగా ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు సానియా.

మే 20న ఈ రెండు చోట్లా పోలింగ్ జరగనుండగా నామినేషన్‌లకు మే 3వ తేదీ చివరి గడువు. ఇప్పటికీ కాంగ్రెస్ ఈ స్థానాలపై ఉలుకుపలుకు లేదు. నిజానికి ఈ రెండు స్థానాల్లో ఓ చోట రాహుల్ గాంధీ నిలబడాల్సి ఉండగా మరో చోట ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారని సమాచారం. అయితే దీనిపై ఇవాళ సాయంత్రం లోపు కాంగ్రెస్ నేతలు ప్రకటన చేస్తారా లేదా వేచిచూడాలి.

Also Read:ఎండ వేడిమి జాగ్రత్తలు..

- Advertisement -